వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు నుంచి ఊరట లభించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వంశీని విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చేర్చుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను విచారించిన కోర్టు ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వంశీ రేపు విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చేరనున్నారు. నకిలీ ఇళ్ల పట్టా పంపిణీ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలను సమర్పించాలని ఏపీ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
