ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మంగళవారం (జూన్ 10)న గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. ఈ మేరకు, APPSC గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ జాబితాను అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది.
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మంగళవారం (జూన్ 10)న విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. ఈ మేరకు, APPSC గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ జాబితాను అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. ఇందులో, అభ్యర్థులను 1: 2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మే 3 నుండి 9 వరకు ఆఫ్లైన్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు జరిగిన ఒక నెల తర్వాత APPSC ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4 వేలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
గత ఏడాది APPSC మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే ఏడాది మార్చి 17న గ్రూప్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,48,881 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వారిలో 91,463 మంది అంటే దాదాపు 72.55 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 4,496 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఈ ఏడాది మే 3 నుంచి 9 వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలకు వీరందరూ హాజరయ్యారు. ఇటీవల విడుదలైన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో 182 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.
