ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు పొడిగింపుపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నెల 9 వరకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
బదిలీలపై నిషేధం 10వ తేదీ నుంచి మళ్లీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
