ఏపీలోని నిరుద్యోగులకు మంచి వారం వచ్చింది. ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 2025 ఇప్పటికే 16,347 పోస్టులతో విడుదల అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో పెద్ద నోటిఫికేషన్ విడుదలైంది.
రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 1620 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మే 13 నుండి ప్రారంభమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మొత్తం ఖాళీలు: 1620
జూనియర్ అసిస్టెంట్ – 230 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ – 651 పోస్టులు, ప్రాసెస్ సర్వర్ – 164 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ – 24 పోస్టులు, కాపీయిస్ట్ – 193 పోస్టులు, ఎగ్జామినర్ – 32 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ 56 పోస్టులు, టైపిస్ట్ – 162 పోస్టులు, స్టెనోగ్రాఫర్ – 80 పోస్టులు, డ్రైవర్ – 28 పోస్టులు. వీటిని జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. మీరు ఏపీ హైకోర్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మే 13 నుండి ప్రారంభమైంది. జూన్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 800, SC, ST, దివ్యాంగ్ అభ్యర్థులు రూ. 400 దరఖాస్తు రుసుము చెల్లించాలి.
సబార్డినేట్ పోస్టులకు 7వ తరగతి విద్యార్హత సరిపోతుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అర్హత అవసరం. అదేవిధంగా, టైపిస్ట్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత మరియు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత అవసరం. అయితే, టైపింగ్ మరియు కంప్యూటర్ అనుభవం తప్పనిసరి. 42 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
