ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై రాళ్లు, చెప్పులు విసిరిన ఘటనలో 9 మందిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ కె. నాగేశ్వరరావు తెలిపారు.
గురువారం సాయంత్రం పొదిలి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. అల్లరిమూకలు రాళ్లు, చెప్పులు విసిరినప్పుడు పోలీసులు, మహిళలు గాయపడ్డారని వెల్లడించారు.
